సదానందగౌడ వ్యాఖ్యలు అర్థరహితం | Sadananda Gowda is meaningless comments | Sakshi
Sakshi News home page

సదానందగౌడ వ్యాఖ్యలు అర్థరహితం

Jun 30 2016 8:52 AM | Updated on Aug 20 2018 9:16 PM

సదానందగౌడ వ్యాఖ్యలు అర్థరహితం - Sakshi

సదానందగౌడ వ్యాఖ్యలు అర్థరహితం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి కోర్టుల విభజనకు ప్రయత్నాలు చేయాల్సిన కేంద్ర మంత్రి....

 బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అనిల్
 

మహబూబ్‌నగర్ క్రైం : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి కోర్టుల విభజనకు ప్రయత్నాలు చేయాల్సిన కేంద్ర మంత్రి సదానందగౌడ అందుకు విరుద్ధంగా మాట్లాడటం సరైంది కాదని బార్ అసోసియేషన్  జిల్లా అధ్యక్షుడు అనిల్‌కుమార్ విమర్శించారు. జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోర్టుల విభజనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి విభజించిన తర్వాతే న్యాయాధికారుల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఆందోళనకు బెక్కెం జనార్ధన్, ఐఎంఈ సంఘం అధ్యక్షుడు రాంమోహన్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్, టీఆర్‌ఎస్ నాయకులు వెంకటయ్య, రాజేశ్వర్‌గౌడు, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు రాము, సురేష్, వెంకట్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారావు, గౌరవ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, కార్యదర్శి శంకర్ సంఘీభావం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement