ఐక్య ఉద్యమాలతోనే రాజ్యాధికారం | ruling power with united protests | Sakshi
Sakshi News home page

ఐక్య ఉద్యమాలతోనే రాజ్యాధికారం

Feb 12 2017 10:31 PM | Updated on Sep 17 2018 5:32 PM

ఐక్య ఉద్యమాలతోనే రాజ్యాధికారం - Sakshi

ఐక్య ఉద్యమాలతోనే రాజ్యాధికారం

రాజకీయంగా కురువలను గుర్తించే పార్టీలకే మద్దతు ఇస్తామని కురువ యువజన సమ్మేళనంలో నేతలు స్పష్టం చేశారు.

- కురువ యువజన సమ్మేళనంలో నేతలు 
- జెడ్పీ మీటింగ్‌ హాలులో కార్యక్రమం
- కురువలను గుర్తించే పార్టీలకే మద్దతు ఇస్తామని ప్రకటన
 
కర్నూలు(అర్బన్‌): రాజకీయంగా కురువలను గుర్తించే పార్టీలకే మద్దతు ఇస్తామని కురువ యువజన సమ్మేళనంలో నేతలు స్పష్టం చేశారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో ఆదివారం ఏర్పాటు చేసిన కురువ యువజన సమ్మేళనానికి జెడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకటరాముడు, బీసీ విద్యార్థి సంఘం జాతీయ కో కన్వీనర్‌ ర్యాగ అరుణ్, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రిష్టప్ప, డా.పుల్లన్న, జయప్ప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంగా పదవులుంటేనే కురువల ఆభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
 
భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో జిల్లాలో రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానాన్ని కురువలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. కురువలకు ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేసి రూ.2 వేల కోట్లు బడ్జెట్‌ కేటాయించాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, కేడీసీసీబీ డైరెక్టర్‌ శ్రీనివాసులు, బీసీ,ఎస్‌సీ,ఎస్‌టీ,మైనారిటీ విద్యార్థి సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ‍‍కె. రామకృష్ణ, బీసీ నాయకులు పాల్గొన్నారు.
కార్యవర్గం ఎన్నిక ....
సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడిగా బత్తిన కుబేరనాథ్, జిల్లా అధ్యక్షులుగా బి. రాజశేఖరబాబు, ఉపాధ్యక్షులుగా కొలిమి వెంకటేష్, ‍కృష్ణ, కె. రఘుబాబు, మహేష్, పులిశేఖర్, హంపి నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా  కె. సురేష్, కార్యదర్శులుగా మొలగవెళ్లి గోపాల్, కె. మహేష్, కె. రాముడు,  బి. దేవేంద్రప్ప, శ్రీనివాసులు, ఎస్‌కే అమరేష్, çకోశాధికారిగా కె. వెంకట్రాముడు, సలహాదారులుగా శేషన్న, మురళీ, ప్రచార కార్యదర్శులుగా బత్తిన రాముడు, కె. నాగేష్, కె. వీరేంద్ర, సహాయ కార్యదర్శులుగా 11 మంది , కార్య నిర్వాహక సభ్యులుగా 19 మంది ఎన్నికయ్యారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement