ఆర్‌యూ తరగతులు పునఃప్రారంభం | ru classes re starts | Sakshi
Sakshi News home page

ఆర్‌యూ తరగతులు పునఃప్రారంభం

Jan 18 2017 12:19 AM | Updated on Jul 6 2018 3:36 PM

సంక్రాంతి సెలవుల అనంతరం రాయలసీమ యూనివర్సిటీ తరగతులు పునఃప్రారంభమైనట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య అమర్‌నాథ్‌ తెలిపారు.

కర్నూలు(ఆర్‌యూ): సంక్రాంతి సెలవుల అనంతరం రాయలసీమ యూనివర్సిటీ తరగతులు పునఃప్రారంభమైనట్లు రిజిస్ట్రార్‌ ఆచార్య అమర్‌నాథ్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సెలవుల అనంతరం వర్సిటీ కళాశాల తరగతులు, మెన్స్, ఉమెన్స్‌ హాస్టళ్లు ప్రారంభమయ్యాయని, విద్యార్థులు జిల్లా నలుమూలల నుంచి రావాల్సి ఉండగా హాజరు శాతం తక్కువగా ఉందన్నారు. నేటి నుంచి నగరంలో జరిగే నందినాటకోత్సవాల్లో భాగంగా జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 4 నాటకాలను విద్యార్థుల విభాగం నుంచి ప్రదర్శిస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement