రూ.5 లక్షల విలువైన కోళ్లు ఎత్తుకెళ్లారు | Rs.5 lakhs worth hens robbery in nalgonda district | Sakshi
Sakshi News home page

రూ.5 లక్షల విలువైన కోళ్లు ఎత్తుకెళ్లారు

Jul 30 2016 9:42 AM | Updated on Sep 4 2017 7:04 AM

రూ.5 లక్షల విలువైన కోళ్లు ఎత్తుకెళ్లారు

రూ.5 లక్షల విలువైన కోళ్లు ఎత్తుకెళ్లారు

నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం శివారులో శనివారం వేగంగా వెళ్తున్న కోళ్ల వ్యాను ఎదురుగా వస్తున్న పాల వ్యానును ఢీకొట్టింది.

నల్గొండ : నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం శివారులో శనివారం వేగంగా వెళ్తున్న కోళ్ల వ్యాను ఎదురుగా వస్తున్న పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యాను డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే కోళ్ల వ్యానులో ఉన్న దాదాపు 1500 కోళ్లను స్థానికులు తమ వెంట తీసుకుని ఎత్తుకెళ్లారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాల వ్యానును సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న కోళ్ల వ్యాన్ ఢీకొట్టిందని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement