చంద్రబాబు చెబుతున్న.. చేస్తున్న మోసాలపై ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమైందని.. త్వరలోనే చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు.
సాక్షి, కడప:
చంద్రబాబు చెబుతున్న.. చేస్తున్న మోసాలపై ప్రజలలో తిరుగుబాటు ప్రారంభమైందని.. త్వరలోనే చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. మంగళవారం రాజంపేటలోని ఉస్మాన్‌నగర్‌లో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి.. గోపవరం మండలం రాచాయపేటలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య.. ఓబుళవారిపల్లె మండలం గద్దెలరేవుపల్లె పంచాయతీలో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు తదితరులు గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలనుంచి ఎక్కడ చూసినా చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని.. ఇప్పటికైనా చంద్రబాబు గుర్తెరిగి ప్రజలకు ఇచ్చిన హామిలను నెరవేర్చాలని సూచించారు. రాష్ట్రాన్ని ఎంతోమంది పరిపాలించారని.. కానీ ఇంత ఘోరంగా పరిపాలించిన ముఖ్యమంత్రులెవరూ లేరని ధ్వజమెత్తారు.
గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తోందని.. ప్రజలు కూడా టీడీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారని వారు తెలిపారు.
నేడు పలుచోట్ల గడప గడపకు వైఎస్‌ఆర్ :
గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా బుధవారం గోపవరం మండలంలోని సండ్రపల్లె గ్రామంలో జరగనుంది. ఈ కార్యక్రమంలో ఎమెల్సీ గోవిందరెడ్డి, సమన్వయకర్త వెంకటసుబ్బయ్య పాల్గొననున్నారు. జమ్మలమడుగు మున్సిపాలిటీలోని 12వ వార్డులో బుధవారం మాజీ మంత్రి, సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమం చేపట్టనున్నారు. రాజంపేట పరిధిలోని ఎర్రబల్లెలో జిల్లా ఆధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరగనున్నారు. ఓబుళవారిపల్లె మండలం బొల్లవరం, బీపీ రాజుపల్లెల్లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొల్లం బ్రహ్మానందరెడ్డిలు గడప గడపకు వైఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ బాబు మోసాలను ఎండగట్టనున్నారు.