కేసీఆర్‌ను కుర్చీ దింపడమే నా జీవిత లక్ష్యం | Revanth reddy slams kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను కుర్చీ దింపడమే నా జీవిత లక్ష్యం

May 26 2016 8:33 AM | Updated on Aug 15 2018 9:30 PM

కేసీఆర్‌ను కుర్చీ దింపడమే నా జీవిత లక్ష్యం - Sakshi

కేసీఆర్‌ను కుర్చీ దింపడమే నా జీవిత లక్ష్యం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దించే వరకు టీడీపీ పోరాడుతుందంటూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

నల్లగొండ మినీ మహానాడులో రేవంత్‌రెడ్డి
 

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ: సీఎం కేసీఆర్‌ను కుర్చీ నుంచి దింపడమే తన జీవిత లక్ష్యమని, ఇందుకోసం తన చెమటనంతా ధారపోస్తానని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌పై కలబడతానని, నిలబడతానని, పడగొడతానని ఆయన శపథం చేశారు. నల్లగొండలో బుధవారం జరిగిన పార్టీ మినీమహానాడుకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ మాట్లాడుతూ కేసీఆర్‌ను కర్కోటక సీఎంగా అభివర్ణించారు.

తెలంగాణలో ఒక్కరోజులోనే సర్వే చేయించానని చెబుతున్న కేసీఆర్.. తొలిదశ ఉద్యమంలో చనిపోయిన 369 మంది, మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన 1200 మంది వివరాలు మాత్రం సేకరించలేకపోయారని, కేవలం 588 మంది అమరవీరులను గుర్తించామని చెపుతున్నారని, అందులోనూ 250 మంది అడ్రస్‌లు లేవంటున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తానే టికెట్లు ఇప్పిస్తానని, కార్యకర్తలకు కేసులుంటే కోర్టు ఫీజులు కడతానని, రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానని, పార్టీ అభ్యర్థులను గెలిపిస్తానని రేవంత్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement