వైవీయూ ఫలితాలు విడుదల చేయండి | results pls | Sakshi
Sakshi News home page

వైవీయూ ఫలితాలు విడుదల చేయండి

Aug 27 2016 6:52 PM | Updated on May 29 2018 6:59 PM

వైవీయూ ఫలితాలు విడుదల చేయండి - Sakshi

వైవీయూ ఫలితాలు విడుదల చేయండి

యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ రీవాల్యుయేషన్‌ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌ విద్యార్థి సమాఖ్య∙నాయకులు కోరారు. శనివారం వైవీయూలో రిజిస్ట్రార్‌ ఆచార్య వై. నజీర్‌అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

వైవీయూ :

యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ  రీవాల్యుయేషన్‌ ఫలితాలను వెంటనే విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌ విద్యార్థి సమాఖ్య∙నాయకులు కోరారు. శనివారం వైవీయూలో రిజిస్ట్రార్‌ ఆచార్య వై. నజీర్‌అహ్మద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సమాఖ్య జిల్లా అధ్యక్షుడు ఎ. ఖాజారహమతుల్లా మాట్లాడుతూ వైవీయూ డిగ్రీ పరీక్షలు పూర్తయి దాదాపు ఆరునెలలైందన్నారు.

ఫలితాల అనంతరం రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.   నేటికీ ఫలితాలు విడుదల చేయలేదన్నారు. దీనివల్ల ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాలు పొందాలనుకున్న వారువిద్యాసంవత్సరం కోల్పోయే అవకాశం ఉందన్నారు. అందువల్ల వెంటనే ఫలితాలు విడుదల చేయాలని కోరారు.   వైవీయూ రీసెట్‌ విడుదల చేయాలని,  విశ్వవిద్యాలయంలోని జిమ్‌ సెంటర్‌ను పూర్తిస్థాయిలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌అలీ, వైవీయూశాఖ అధ్యక్షుడు వినయ్‌కుమార్, రహీం, అమర్, నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement