కల్లు సీసాల్లో పాలవిందెలు, ఎలుకలు | rats and lizards in liqar bottles | Sakshi
Sakshi News home page

కల్లు సీసాల్లో పాలవిందెలు, ఎలుకలు

Apr 3 2016 12:38 AM | Updated on Jul 18 2019 2:26 PM

కల్లు సీసాల్లో పాలవిందెలు, ఎలుకలు - Sakshi

కల్లు సీసాల్లో పాలవిందెలు, ఎలుకలు

కల్లు సీసాల్లో పాలవిందెలు, ఎలుకల తేలియాడుతున్న సంఘటన నవాబుపేట మండలం గేట్‌వనంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

నవాబుపేట : కల్లు సీసాల్లో పాలవిందెలు, ఎలుకల తేలియాడుతున్న సంఘటన నవాబుపేట మండలం గేట్‌వనంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. రెండు రోజులుగా చోటుచేసుకుంటున్న ఘటనలతో ఆందోళన చెందిన స్థానికు లు ఆం దోళన చేపట్టారు.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గేట్‌వనంపల్లి గ్రామానికి చెందిన జైపాల్‌రెడ్డి కల్లు తాగేందుకు శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో  గ్రామంలోని నర్సింహులుకు చెందిన కల్లు దుఖానానికి వెళ్లాడు. అక్కడ పని చేస్తున్న శ్రీైశైలం జైపాల్‌రెడ్డికి ఒక కల్లు సీసా ఇచ్చాడు. దాంతో అతను తాగడానికి తీసుకోగానే అందులో పాలవిందె కదులుతూ కని పించింది.

గమనించిన అతను తోటి వారికి చూపిం చాడు. అందరూ కలిసి కల్లు విక్రయిస్తున్న వారిని నిలదీశారు. శుక్రవారం సైతం దుకాణంలో కల్లు సీసాల్లో ఎలుకలు వచ్చాయని చెప్పారు. సుచి, శుభ్రత లేని కల్లు మా గ్రామంలో విక్రహించవద్దని హెచ్చరించారు. ఈ విషయమై ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చినా విచారణ కూడా చేపట్టలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కాగా ఇందులో తమ తప్పు లేదని, గొల్లగూడ వద్ద ఉన్న కల్లు డిపోలో వ్యాపారులు తయారు చేసి పంపిన కల్లును మాత్రమే విక్రయిస్తున్నామని నిర్వాహకులు తెలి పారు.

 చర్యలు తీసుకుంటాం..
ఈ విషయమై ఎక్సైజ్ సీఐ సుధాకర్‌ను వివరణ కోరగా కల్లు సీసాల్లో పాలవిందెలు, ఎలుకలు వచ్చిన విషయం తమ దృష్టికి రాలేదని, పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement