జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి జిల్లాలోని 29 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదయింది.
జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు
May 27 2017 11:18 PM | Updated on Sep 5 2017 12:09 PM
– ఆళ్లగడ్డలో అత్యధికంగా 49.4 మి.మీ., వర్షపాతం
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో ఒక మోస్తరు వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి జిల్లాలోని 29 మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షపాతం నమోదయింది. అత్యధికంగా ఆళ్లగడ్డలో 49.4 మి.మీ., వర్షం కురిసింది. గోస్పాడు మండలంలో గాలి, వాన బీభత్సం సృష్టించాయి. ఈ కారణంగా విద్యుత్ శాఖకు భారీ నష్టం జరిగింది. నంద్యాలలో పెనుగాలుల వల్ల గుడిసెల పైకప్పులు లేచిపోయాయి. అవుకులో గాలుల తీవ్రతకు చెట్లు విరిగిపడ్డాయి. ముఖ్యంగా పండ్లతోటలకు అపార నష్టం వాటిల్లింది. ఆళ్లగడ్డలో 49.4 మి.మీ., శ్రీశైలంలో 29.8, పాములపాడులో 27.4, రుద్రవరంలో 26.2, గోస్పాడులో 22, ఉయ్యలవాడలో 20, నంద్యాలలో 18, కోవెలకుంట్లలో 17.2, బనగానపల్లిలో 17.2 మి.మీ., వర్షపాతం నమోదయింది. మే నెల సాధారణ వర్షపాతం 38.5 మి.మీ., ఉండగా.. ఇప్పటి వరకు 25.8 మి.మీ., వర్షం కురిసింది. వివిధ మండలాల్లో వర్షాలు పడటంతో వేసవి దుక్కులు ముమ్మరం అయ్యాయి.
Advertisement
Advertisement