రైలు ఢీకొని వ్యక్తి మృతి | rail accident.. person dead | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Nov 12 2016 2:14 AM | Updated on Sep 4 2017 7:50 PM

ఏలూరు అర్బ¯ŒS : రైలు పట్టాలపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. అతని మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం..

ఏలూరు అర్బ¯ŒS  :  రైలు పట్టాలపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తి మరణించాడు. అతని మృతదేహాన్ని రైల్వే పోలీసులు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఏలూరు రైల్వే స్టేష¯ŒS సమీపంలోని టింబర్‌ డిపో వద్ద మృతదేహం పడి ఉందని రైల్వే పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులను విచారించినా ఫలితం లేకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు పట్టాలు దాటుతుండగా గుర్తుతెలియని రైలు ఢీ కొట్టడంతో మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుని వయసు 45 సంవత్సరాల వరకూ ఉంటుందని చెబుతున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement