కోటిపల్లి వద్ద రేస్‌ కోర్స్‌ | race course at kotipalli | Sakshi
Sakshi News home page

కోటిపల్లి వద్ద రేస్‌ కోర్స్‌

Mar 11 2017 11:12 PM | Updated on Sep 5 2017 5:49 AM

తనకల్లు మండలం కోటిపల్లి గ్రామం వద్ద రేస్‌ కోర్సు ఏర్పాటు చేసేందుకు టూరిజం శాఖ ముందుకు వచ్చింది.

అనంతపురం  అర్బన్‌ : తనకల్లు మండలం కోటిపల్లి గ్రామం వద్ద రేస్‌ కోర్సు ఏర్పాటు చేసేందుకు టూరిజం శాఖ ముందుకు వచ్చింది. ఇందు కోసం భూమి కేటాయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. బుక్కపట్నం మండలం కొత్తపేటలో ఫారెస్టు రిజర్వు భూమిలో సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాల్సి ఉన్నందున భూముల సర్వే వెంటనే చేపట్టాలని డీఎఫ్‌ఓ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

జేసీ మాట్లాడుతూ ఓడీ చెరువు మండలం తంగేడుకుంటలో రైతు వారీగా పట్టాలు మంజూరు చేయాల్సి ఉందని, అభ్యంతరాలపై ఈనెల 17వ తేదీలోపు విచారణ పూర్తి చేయాలని సంబంధిత తహసీల్దారుని ఆదేశించారు. ముత్యాల చెరువులో ఆర్‌ అండ్‌ ఆర్‌ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.  సమావేశంలో డీఎఫ్‌ఓ చంద్రశేఖర్, కదిరి, ధర్మవరం ఆర్డీఓలు, వెంకటేశ్, బాలానాయక్, సర్వే ల్యాండ్‌ రికార్డుల శాఖ ఏడీ మశ్చీంద్రనాథ, కార్పొరేషన్‌ అదనపు కమిషనర్‌ పగడాల కృష్ణమూర్తి, బుక్కపట్నం, తనకల్లు తహసీల్దారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement