breaking news
b.laxmikantham
-
కోటిపల్లి వద్ద రేస్ కోర్స్
అనంతపురం అర్బన్ : తనకల్లు మండలం కోటిపల్లి గ్రామం వద్ద రేస్ కోర్సు ఏర్పాటు చేసేందుకు టూరిజం శాఖ ముందుకు వచ్చింది. ఇందు కోసం భూమి కేటాయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. బుక్కపట్నం మండలం కొత్తపేటలో ఫారెస్టు రిజర్వు భూమిలో సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాల్సి ఉన్నందున భూముల సర్వే వెంటనే చేపట్టాలని డీఎఫ్ఓ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఓడీ చెరువు మండలం తంగేడుకుంటలో రైతు వారీగా పట్టాలు మంజూరు చేయాల్సి ఉందని, అభ్యంతరాలపై ఈనెల 17వ తేదీలోపు విచారణ పూర్తి చేయాలని సంబంధిత తహసీల్దారుని ఆదేశించారు. ముత్యాల చెరువులో ఆర్ అండ్ ఆర్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్ఓ చంద్రశేఖర్, కదిరి, ధర్మవరం ఆర్డీఓలు, వెంకటేశ్, బాలానాయక్, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ ఏడీ మశ్చీంద్రనాథ, కార్పొరేషన్ అదనపు కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, బుక్కపట్నం, తనకల్లు తహసీల్దారులు పాల్గొన్నారు. -
రైసుమిల్లుపై దాడులు
కోవూరు/నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: చౌకదుకాణం బియ్యాన్ని అక్రమంగా తరలించి రీసైక్లింగ్ చేస్తున్న సమాచారంతో జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదివారం కోవూరు మండలంలోని ఇనమడుగు రోడ్డులో ఉన్న వెంకటసాయి లక్ష్మి రాబాయిల్డ్ రైసుమిల్లు, శెట్టిగుంటరోడ్డు పరమేశ్వరి రైసుమిల్లుపై దాడులు చేశారు. పరమేశ్వరి రైస్‌మిల్లులో తనిఖీలు చేసిన అధికారులు 67.5 క్విం టాళ్ల బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్టు గుర్తించారు. వీటి విలువ రూ.2.36 లక్షలు అని జేసీ తెలిపారు సుమారు రూ.10 లక్షల విలువైన 934 బస్తాల బియ్యంను సీజ్ చేశారు. ఈ సందర్భంగా జేసీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ జిల్లాలోని పలు రైసుమిల్లర్లు పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి వాటిని రీ సైక్లింగ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. రేషన్ బియ్యాన్ని కల్తీ చేసి నాణ్యమైన బియ్యంగా విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటికే ఇలా అక్రమ వ్యాపారం చేస్తున్న పలు రైసుమిల్లులపై నిఘా పెట్టేందుకు తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు ప్రతి రోజు ఏదో ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. కొడవలూరు మండలం సీఎస్ పురం, కోవూరు మండలం ఇనమడుగు రోడ్డులోని రైసు మిల్లులపై ఈ బృందాలు దాడులు చేసి పేదల బియ్యాన్ని సీజ్ చేశాయన్నారు. ఆయా మిల్లర్లపై 6ఏ కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో డీఎస్ఓ ఉమమహేశ్వరరావు, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ ధర్మారెడ్డి, కోవూరు తహశీల్దారు సాంబశివరావు, నెల్లూరు, కావలి ఏఎస్ఓలు శంకర్, శ్రీహరి, సీఎస్‌డీటీ వెంకట్రావు, వీఆర్వో నాగేశ్వరరావు పాల్గొన్నారు.