breaking news
race course
-
కోటిపల్లి వద్ద రేస్ కోర్స్
అనంతపురం అర్బన్ : తనకల్లు మండలం కోటిపల్లి గ్రామం వద్ద రేస్ కోర్సు ఏర్పాటు చేసేందుకు టూరిజం శాఖ ముందుకు వచ్చింది. ఇందు కోసం భూమి కేటాయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఆదేశించారు. బుక్కపట్నం మండలం కొత్తపేటలో ఫారెస్టు రిజర్వు భూమిలో సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాల్సి ఉన్నందున భూముల సర్వే వెంటనే చేపట్టాలని డీఎఫ్ఓ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ఓడీ చెరువు మండలం తంగేడుకుంటలో రైతు వారీగా పట్టాలు మంజూరు చేయాల్సి ఉందని, అభ్యంతరాలపై ఈనెల 17వ తేదీలోపు విచారణ పూర్తి చేయాలని సంబంధిత తహసీల్దారుని ఆదేశించారు. ముత్యాల చెరువులో ఆర్ అండ్ ఆర్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్ఓ చంద్రశేఖర్, కదిరి, ధర్మవరం ఆర్డీఓలు, వెంకటేశ్, బాలానాయక్, సర్వే ల్యాండ్ రికార్డుల శాఖ ఏడీ మశ్చీంద్రనాథ, కార్పొరేషన్ అదనపు కమిషనర్ పగడాల కృష్ణమూర్తి, బుక్కపట్నం, తనకల్లు తహసీల్దారులు పాల్గొన్నారు. -
రేస్‌కోర్సులో లైంగిక వేధింపులు..
- మీడియాను ఆశ్రయించిన బాధితురాళ్లు రాజమండ్రి రేస్‌కోర్సులో పని చేస్తున్న మహిళా ఉద్యోగులను అక్కడ క్యాషియర్‌గా పని చేస్తున్న వ్యక్తి లైంగికంగా వేధిస్తుండటంతో.. విసిగిపోయిన ఉద్యోగినులు రోడ్డెక్కారు. హైదరాబాద్ మలక్‌పేట్ రేస్కోర్ట్కు అనుబంధ సంస్థ అయిన ‘క్వారియే రేస్కోర్ట్ రాజమండ్రి’లో క్యాషియర్‌గా పని చేస్తున్న రమేష్ బాబు అనే వ్యక్తి తమను లైగికంగా వేధిస్తున్నాడని రేస్‌కోర్సులో పని చేస్తున్న ఉద్యోగినులు మిడియాతో వాపోయారు. ఈ అంశంపై పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అందుకే ప్రజల దృష్టికి తీసుకురావడానికి మీడియాను ఆశ్రయించామని 20 మంది బాధితురాళ్లు మీడియాకు తెలిపారు.