ఉరేసుకుని పుణే వాసి ఆత్మహత్య | Pune man commits suicide | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని పుణే వాసి ఆత్మహత్య

Oct 3 2016 1:18 AM | Updated on Nov 6 2018 7:56 PM

ఉరేసుకుని పుణే వాసి ఆత్మహత్య - Sakshi

ఉరేసుకుని పుణే వాసి ఆత్మహత్య

జలదంకి : చెట్టుకు ఉరేసుకుని మహారాష్ట్రలోని పుణే జిల్లా వాగోలి తాలూకా తుకారాం నగర్‌కు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని జమ్మలపాళెం పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆదివారం జరిగింది.

జలదంకి : చెట్టుకు ఉరేసుకుని మహారాష్ట్రలోని పుణే జిల్లా వాగోలి తాలూకా తుకారాం నగర్‌కు చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని జమ్మలపాళెం పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రాజు లక్ష్మణ్‌ యాదవ్‌ (33) జమ్మలపాళెం సమీపంలోని చింతచెట్టుకు ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. జలదంకి ఎస్సై అంజిరెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. చెట్టుకు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకు దించి మృతుడి వద్ద ఆధారాలు కోసం పరిశీలించారు. మృతుడి జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్‌యాదవ్‌గా గుర్తించారు. అయితే మృతుడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు. ఇక్కడ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు మహారాష్ట్ర పోలీసులకు తెలిజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   
 
  

Advertisement
 
Advertisement
Advertisement