కొల్లాపూర్‌రూరల్ : గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కొందరు ఆక్రమించారని వాటిని ఇప్పించి ఆదుకోవాలని మండలపరిధిలోని మొలచింతలపల్లి గ్రామం బ్రమరాంబ కాలనీ చెంచులు మంగళవారం తహసీల్దార్ పార్థసారధికి వినతిపత్రం ఇచ్చారు.
ఇళ్ల స్థలాలు ఇప్పించాలి
Jul 20 2016 12:17 AM | Updated on Sep 4 2017 5:19 AM
కొల్లాపూర్‌రూరల్ : గతంలో ప్రభుత్వం తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను కొందరు ఆక్రమించారని వాటిని ఇప్పించి ఆదుకోవాలని మండలపరిధిలోని మొలచింతలపల్లి గ్రామం బ్రమరాంబ కాలనీ చెంచులు మంగళవారం తహసీల్దార్ పార్థసారధికి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా చెంచు సమాఖ్య అధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ ప్రభుత్వం సర్వేనంబర్ 299, 212, 228, 259లో స్థలాలు చూపించి పట్టాలు ఇచ్చిందని, వాటిని కొందరు ఆక్రమించారని తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రమేష్, సాలమ్మ శివ, మాధవి, ఉమ, లక్ష్మి, అలివేలమ్మ, లక్ష్మి, నిరంజనమ్మ, గంగన్న, బయ్యన్న, రాముడు, సీతమ్మ, చంద్రమ్మ, పుల్లమ్మ, తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement