ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి | Provide Job protection to Outsourcing Employees | Sakshi
Sakshi News home page

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

Aug 26 2016 12:07 AM | Updated on Jul 29 2019 2:51 PM

మాట్లాడుతున్న కోదండరాం - Sakshi

మాట్లాడుతున్న కోదండరాం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) : హౌసింగ్‌లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని టీజేఏసీ రాష్ట్ర చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు. ధర్నా చౌక్‌లో హౌసింగ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు గురువారం రెండోరోజు కొనసాగాయి. వారి దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు.

– టీజేఏసీ రాష్ట్ర చైర్మన్‌ కోదండరాం
జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) : హౌసింగ్‌లో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని టీజేఏసీ రాష్ట్ర చైర్మన్‌ కోదండరాం డిమాండ్‌ చేశారు.  ధర్నా చౌక్‌లో హౌసింగ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలు గురువారం రెండోరోజు కొనసాగాయి. వారి దీక్షకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను ఉన్నట్లుండి విధల నుంచి తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1179 మందిని మార్చి నెల నుంచి తొలగించినట్లు తెలిపారు. వారికి ప్రత్యమ్నాయం చూపకుండా తొలగించండంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చిస్తానని చెప్పారు. కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా చైర్మన్‌ రాజేందర్‌రెడ్డి, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతయ్య, అన్ని శాఖల ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి, సుల్తాన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement