కాపులను బీసీలో చేర్చొద్దని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక కార్యకర్తలు గురువారం అనంతపురం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు.
కాపులను బీసీలో చేర్చొద్దని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక కార్యకర్తలు గురువారం అనంతపురం కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. కాపులను బీసీలలో చేర్చితే మహా ఉద్యమం చేపడుతామని ఐక్యవేదిక నాయకులు హెచ్చరించారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.