పి.గన్నవరం మండలం జి.పెదపూడి శివారు ఉచ్చులవారిపేటలో కనిపించిన విషాద దృశ్యమిది. గ్రామానికి చెందిన గిడ్డి పల్లాలమ్మ (70) ఆదివారం మృతి చెందింది. గ్రామంలోని ప్రధాన పంట కాలువకు ఆవల ఉన్న లంకను గ్రామస్తులు మరుభూమిగా వినియోగిస్తున్నారు.
చివరి మజిలీలో నరకయాతన
Mar 20 2017 12:04 AM | Updated on Sep 5 2017 6:31 AM
పి.గన్నవరం మండలం జి.పెదపూడి శివారు ఉచ్చులవారిపేటలో కనిపించిన విషాద దృశ్యమిది. గ్రామానికి చెందిన గిడ్డి పల్లాలమ్మ (70) ఆదివారం మృతి చెందింది. గ్రామంలోని ప్రధాన పంట కాలువకు ఆవల ఉన్న లంకను గ్రామస్తులు మరుభూమిగా వినియోగిస్తున్నారు. అక్కడకు వెళ్లేందుకు ఏడేళ్ల కిందట చేపట్టిన వంతెన నిర్మాణాన్ని పాలకులు నేటికీ పూర్తి చేయలేదు. దీంతో గ్రామంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని కాలువ ఆవలి ఒడ్డుకు చేర్చేందుకు గ్రామస్తులు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. పల్లాలమ్మ మృతదేహాన్ని అరటి తెప్పపై ఉంచి, కాలువ ఈదుతూ దాటిస్తున్న యువకులను చిత్రంలో చూడవచ్చు.
– పి.గన్నవరం
Advertisement
Advertisement