ఒలింపిక్స్‌ ప్రాబబుల్స్‌లో చోటు | Probables for Olympics place | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌ ప్రాబబుల్స్‌లో చోటు

Nov 8 2016 12:06 AM | Updated on Sep 4 2017 7:28 PM

హిందూపురం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న వి.రిత్విక్‌ జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి ఒలింపిక్స్‌ ప్రాబబుల్స్‌లో స్థానం సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్‌ మేరి, కోచ్‌ రామచంద్రలు సోమవారం తెలిపారు.

హిందూపురం టౌన్ :
హిందూపురం పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో చదువుతున్న వి.రిత్విక్‌ జాతీయస్థాయి కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచి ఒలింపిక్స్‌ ప్రాబబుల్స్‌లో స్థానం సాధించినట్లు  పాఠశాల ప్రిన్సిపల్‌ మేరి, కోచ్‌ రామచంద్రలు సోమవారం తెలిపారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో రిత్విక్‌ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతిని సాధించి సినీనటుడు సుమన్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నాడు. అదే విధంగా త్వరలో ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు అర్హత సాధించాడని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపల్, కోచ్‌తో పాటు ఎఓ ప్రభాకర్‌రెడ్డి, డీన్ నాగరాజు, తల్లిదండ్రులు వెంకటేష్, అరుణలు అభినందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement