
'లైంగిక వేధింపులకు ప్రిన్సిపాలే కారకుడు'
నాగార్జున యూనివర్శిటీలో తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిన్సిపాల్ బాబూరావే కారకుడని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
వరంగల్:నాగార్జున యూనివర్శిటీలో తన కూతురు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రిన్సిపాల్ బాబూరావే కారకుడని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి యూనివర్శిటీల్లో మరే ఇతర అమ్మాయికి ఇలా జరగకూడదన్నారు. అప్పుడే తన కుమార్తె జీవించి ఉన్నట్లు భావిస్తానని తెలిపారు. తన కూతురిపై లైంగిక వేధింపులకు ప్రిన్సిపాల్ బాబూరావునే కారణమని.. ఆ ప్రిన్సిపాల్ కు శిక్ష పడాల్సిందేనని కన్నీటి పర్యంతమైయ్యారు. ఈ నేరం చేసినందుకు బాబూరావుకు ఎలాంటి శిక్షా విధించలేదన్నారు. లైంగిక వేధింపులకు పూర్తిస్థాయి సహకారాన్ని ప్రిన్సిపాల్ అందించారన్నారు.
హాయ్ లాండ్ లో జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో తన కుమార్తెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తితో ప్రిన్సిపాల్ అవార్డు ఇప్పించడమేమిటని ప్రశ్నించారు. ఆ అవార్డు ఇచ్చిన ఫోటో తీసి అందరికీ షేర్ చేసుకోవాల్సిన అవసరమేమిటన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డ బాబూరావుకు ఎలాంటి శిక్ష విధిస్తారని మురళీకృష్ణ అడిగారు.