ఏనుగుల దాడుల నివారణకు పటిష్ట చర్యలు | precautions for elephant attacks | Sakshi
Sakshi News home page

ఏనుగుల దాడుల నివారణకు పటిష్ట చర్యలు

Aug 23 2016 10:54 PM | Updated on Sep 4 2017 10:33 AM

డీఎఫ్‌వో చక్రపాణి

డీఎఫ్‌వో చక్రపాణి

కుప్పం, రామకుప్పం ప్రాంతాల్లో ఏనుగుల దాడులు అధికంగా ఉన్నాయనీ, వాటి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెస్ట్‌ డీఎఫ్‌వో చక్రపాణి తెలిపారు.

– 95 శాతం రక్షణ చర్యలు పూర్తి
– నష్టపరిహారం త్వరలో అందిస్తాం
– డీఎఫ్‌వో చక్రపాణి
చిత్తూరు(కార్పొరేషన్‌) :
కుప్పం, రామకుప్పం ప్రాంతాల్లో ఏనుగుల దాడులు అధికంగా ఉన్నాయనీ, వాటి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వెస్ట్‌ డీఎఫ్‌వో చక్రపాణి తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎలిఫెంట్‌ ఫ్రూఫ్‌ ట్రెంచ్‌ 201 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయిందన్నారు. 118 ఆర్‌సీసీ పిల్లరు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో 58  నిర్మాణం పూర్తయ్యాయన్నారు. మిగిలిన 60 నిర్మాణ దశలో ఉన్నట్టు చెప్పారు. అక్టోబరులో వాటి నిర్మాణం పూర్తవుతుందన్నారు. గజరాజుల దాడుల్లో వందలాది ఏకరాలు పంట నష్టపోయిన రైతులకు రూ.14 లక్షలు పరిహార నివేదిక కలెక్టర్‌కు పంపించామన్నారు. ఆయన అనుమతి జారీచేస్తే బాధితులకు పరిహారం అందజేస్తామన్నారు. ఈ వర్షాకాల సీజన్‌లో మొత్తం 320 హెక్టార్లలో ఆరు లక్షల మొక్కల పెంపకం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.  స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ 77 వాహనాల అంచనా విలువ రవాణా అధికారులు వేసిన వెంటనే బహిరంగ వేలం నిర్వహించి విక్రయిస్తామని తెలిపారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement