రూ.50కే పోస్టల్‌ అకౌంట్‌ | Postal account for just Rs.50 | Sakshi
Sakshi News home page

రూ.50కే పోస్టల్‌ అకౌంట్‌

Nov 15 2016 9:21 PM | Updated on Apr 3 2019 8:07 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సేవలకు ఆదేశించినా పోస్టల్‌ శాఖ తనదైన శైలిలో ప్రజలకు సేవలు..

గుంటూరు (లక్ష్మీపురం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సేవలకు ఆదేశించినా పోస్టల్‌ శాఖ తనదైన శైలిలో ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంది. జిల్లావాసులు ఇటీవల పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో వేల రూపాయలు పెట్టి బ్యాంకులో ఖాతాలు తెరవలేని సామాన్యుల కోసం తపాలా శాఖ వారు యాభై రూపాయలకే అకౌంట్‌ తెరిచే అవకాశం కల్పిస్తోంది. ఈ ఖాతాల ద్వారా నగదును జమ చేసుకోవచ్చు, డిపాజిట్లు చేసుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో పెద్ద నోట్లను బదిలీ చేసుకునేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోస్టల్‌ కేంద్రాలలో ఈ ఖాతాలు తెరుచుకోవచ్చు
ఖాతా తెరవాల్సిన విధానం....
పోస్టల్‌ శాఖలో 50 రూపాయలకే అకౌంట్‌ తెరిచేందుకు రెండు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు, ఆధార్‌ కార్డు కచ్చితంగా ఉండాలి. ఈ ఖాతాలో ఖాతాదారుడు రూ.49 వేల రూపాయల వరకు జమ చేసుకోవచ్చు.అంతకంటే అధికంగా నగదు డిపాజిట్‌ చేసుకునే ఖాతాదారులకు పాన్‌ కార్డ్‌ కచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం బ్యాంక్‌ ఖాతాదారులతో పాటు పోస్టల్‌ శాఖలో ఖాతాలు ఉన్న వారికి కూడా వారంలో రూ.24 వేల రూపాయాలు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement