మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం సంగారెడ్డిపేటలో పోలీస్‌పికెట్ ఏర్పాటు చేసినట్లు జోగిపేట సిఐ వెంకటయ్య తెలిపారు.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం సంగారెడ్డిపేటలో పోలీస్‌పికెట్ ఏర్పాటు చేసినట్లు జోగిపేట సిఐ వెంకటయ్య తెలిపారు. సోమవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. శిఖం భూముల విషయంలో ఆదివారం సంగారెడ్డిపేట, వీరోజిపల్లి గ్రామస్తులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై సోమవారం డీఎస్పీ నాగరాజు, తహశీల్దార్ పద్మారావు, సీఐ వెంకటయ్య రెండు వర్గాల ప్రజలతో సమావేశమయ్యారు. శిఖం భూముల విషయంలో రెండు గ్రామాలకు చెందిన 30 మందిపై కేసులు నమోదు చేశామని, 100 మందికి నోటీసులు అందజేశామని చెప్పారు. ఈ సంఘటనలో గాయపడిన వారు ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఎవరూ శిఖం భూములు దున్నరాదని తెలిపారు.