జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 500కు పైగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ ఉద్యోగులు శనివారం జిల్లా కేంద్రం ఏలూరుకు వచ్చారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 27 నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
జిల్లాకు తరలివచ్చిన అదనపు పోలీస్ బలగాలు
Jul 23 2017 1:03 AM | Updated on Aug 21 2018 7:19 PM
ఏలూరు అర్బన్ : జిల్లాకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దాదాపు 500కు పైగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న పోలీస్ ఉద్యోగులు శనివారం జిల్లా కేంద్రం ఏలూరుకు వచ్చారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌తో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈనెల 27 నుంచి పాదయాత్ర చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలో ఈ సిబ్బందిని రిజర్వు ఫోర్స్‌గా పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేయనున్నారు. పాదయాత్ర సందర్భంగా జిల్లాలో ఎక్కడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఈ బలగాలను అవసరం మేరకు ఆయా ప్రాంతాలకు తరలించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టేందుకు ఈ బలగాలను అధికారులు ఉపయోగించుకోనున్నారు. నలుగురు డీఎస్పీ, నలుగురు సీఐలు, 20 మంది ఎస్సైలు, 250 మంది కానిస్టేబుళ్లు, 220 మంది హోంగార్డులను వినియోగించనున్నారు.
Advertisement
Advertisement