పకడ్బందీగా వాహనాల మళ్లింపు | Planingly Traffic control | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా వాహనాల మళ్లింపు

Aug 12 2016 9:29 PM | Updated on May 25 2018 5:49 PM

వాహనాలను మళ్లిస్తున్న పోలీసులు - Sakshi

వాహనాలను మళ్లిస్తున్న పోలీసులు

భూత్పూర్‌: కృష్ణ పుష్కరాల సందర్భంగా మండల కేంద్రం శివారులో పోలీసులు కృష్ణపుష్కరాలకు వెళ్లే వాహనాల మళ్లింపును పకడ్బందీగా చేపడుతున్నారు.

భూత్పూర్‌: కృష్ణ పుష్కరాల సందర్భంగా మండల కేంద్రం శివారులో పోలీసులు కృష్ణపుష్కరాలకు వెళ్లే వాహనాల మళ్లింపును పకడ్బందీగా చేపడుతున్నారు. కృష్ణపుష్కరాలకు వెళ్లే భక్తులు వారు వెళ్లాల్సిన ఘాట్లను బట్టి పోలీసులు వాహనాలను మళ్లిస్తున్నారు. శుక్రవారం డీఎస్పీ రవీందర్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు వాహనాలను దారి మళ్లింపు చర్యలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు వెళ్లే భక్తులు వారు వెళ్లాల్సిన ఘాట్లను బట్టి వాహనాలను మళ్లించాలని సూచించారు. ప్రయాణికులకు ఆటంకాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  కార్యక్రమంలో ఎస్‌ఐ అశోక్, కానిస్టేబుల్‌ నర్సిములు తదితరులు పాల్గోన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement