శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌కు లీకేజీ | pipeline leak of sriramareddy scheme | Sakshi
Sakshi News home page

శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌కు లీకేజీ

Sep 22 2017 10:52 PM | Updated on Sep 22 2017 11:13 PM

శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌కు లీకేజీ

శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌కు లీకేజీ

మండల పరిధిలోని లక్ష్మంపల్లి జెడ్పీ హైస్కూల్‌ వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది.

శెట్టూరు(లక్ష్మంపల్లి): మండల పరిధిలోని లక్ష్మంపల్లి జెడ్పీ హైస్కూల్‌ వద్ద శ్రీరామరెడ్డి తాగునీటి పైపులైన్‌కు లీకేజీ ఏర్పడింది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి నీరు పైకి ఎగజిమ్ముతూ ఫౌంటెయిన్‌ను తలపించింది. సాయంత్రానికి సంబంధిత అధికారులు స్పందించి లీకేజీని మరమ్మతు చేసినా అప్పటికే చాలా నీరు వృథాగా పోయింది. తరచూ ఇలా జరుగుతున్నా అధికారులు తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. లీకేజీ వల్ల పలు గ్రామాలకు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని వాపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement