పుణ్యస్నానం చేద్దామని గోదావరి తీరానికి వచ్చిన భక్తులు పుణ్యలోకాలకు చేరిపోయారు.
రాజమండ్రి : పుణ్యస్నానం చేద్దామని గోదావరి తీరానికి వచ్చిన భక్తులు పుణ్యలోకాలకు చేరిపోయారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం పుష్కరఘాట్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో 27 మంది కన్నుమూశారు. అనేక మంది గాయపడ్డారు. భక్తిభావంతో కళకళలాడాల్సిన పుష్కరఘాట్లలో...ఓవైపు ఏడుపులు, మరోవైపు తమవారి జాడ కోసం...అయినవారి ఆర్తనాదాలతో ఇప్పుడు భీకర వాతావరణం నెలకొంది.
రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్కు తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.. అయితే విఐపీల కోసం గేట్లన్నీ మూసి వుంచారు.. వీఐపీలు వెళ్లిపోయాక ఒక్కసారిగా గేటు తెరవటంతో తొక్కిసలాట జరిగింది.. ఇప్పటి వరకు వున్న సమాచారం ప్రకారం 25 మంది చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, వృద్ధులే ఎక్కువ మంది వున్నారు. తొక్కిసలాటతో అక్కడ భయానక వాతావరణ ఏర్పడింది.. ప్రాణాలు దక్కించుకునేందుకు భక్తులు అక్కడ వున్న వాహనాలు, దేవాలయం గోపురాలు, గోడలపైకి ఎక్కారు. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.