పీడీ పోస్టులు భర్తీ చేయాలి | phylop the pd posts | Sakshi
Sakshi News home page

పీడీ పోస్టులు భర్తీ చేయాలి

Sep 30 2016 12:25 AM | Updated on Sep 4 2017 3:31 PM

దేవరకద్ర : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పీడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ద¯Œæరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

దేవరకద్ర :  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పీడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ద¯Œæరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, గోపన్‌పల్లి, కౌకుంట్ల, పేరూర్‌ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఆయన కలిశారు. రాష్ట్రంలో క్రీడలను ప్రత్యేకమైన పాఠ్యాంశంగా చేర్చి ప్రతి రోజు అన్ని సబ్జెక్టుల మాదిరిగా బోధించాలని కోరారు. ఈ పద్ధతి కేరళ రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు.  జిల్లాలో మొత్తం 600 పాఠశాలల్లో పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే వీటిని భర్తీ చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement