అనుమతి లేని పెట్రోల్‌ బంకు సీజ్‌ | petrol bunk sieze due to no permission | Sakshi
Sakshi News home page

అనుమతి లేని పెట్రోల్‌ బంకు సీజ్‌

Nov 3 2016 10:43 PM | Updated on Sep 28 2018 3:27 PM

అనుమతి లేని పెట్రోల్‌ బంకు సీజ్‌ - Sakshi

అనుమతి లేని పెట్రోల్‌ బంకు సీజ్‌

భీమడోలు : పూళ్లలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పెట్రోల్‌బంకును అధికారులు గురువారం సీజ్‌ చేశారు. రూ.2.30లక్షల విలువ గల పెట్రోలు, డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

భీమడోలు : పూళ్లలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పెట్రోల్‌బంకును అధికారులు గురువారం సీజ్‌ చేశారు. రూ.2.30లక్షల విలువ గల పెట్రోలు, డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు  మండలంలోని పెట్రోల్‌ బంకులపై పౌరసరఫరా విభాగం, తూనికలు కొలతలు, రెవెన్యూ శాఖల అధికారులు దాడులు నిర్వహించారు.  ఏజీపీవో టి.శ్రీరామ్‌ప్రసాద్‌ నేతృత్వంలో అసిస్టెంట్‌ లీగల్‌మెట్రాలజీ అధికారి ఎం.వెంకట్రావు, ఏలూరు అగ్నిమాపక కేంద్రం అధికారి పీవీ రామకృష్ణ, ఫుడ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ కె.రమేష్‌కుమార్, భీమడోలు ఆర్‌ఐ మల్లికాలు బంకులను తనిఖీ చేశారు. జాతీయ రహదారిపై పూళ్ల వద్ద గల మురళీకృష్ణ ఫిల్లింగ్‌స్టేషన్‌కు ఎటువంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో దానిని సీజ్‌ చేశారు.  బంకును యాజమాని సీహెచ్‌కే మోహన్‌ గత మూడు నెలలుగా నిర్వహిస్తున్నట్టు గుర్తించిన అధికారులు  1,294 లీటర్ల పెట్రోలు, 2,099 లీటర్ల డీజిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. యాజమానిపై 6(ఏ) కేసు నమోదు చేశారు.  
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement