కుమార్తెలకు పురుగుల మందు తాపి.. | pesticide for daughters | Sakshi
Sakshi News home page

కుమార్తెలకు పురుగుల మందు తాపి..

Sep 28 2016 11:34 PM | Updated on Nov 6 2018 7:56 PM

చిన్న కూతురు వాణికి చికిత్స చేయిస్తున్న దశ్యం - Sakshi

చిన్న కూతురు వాణికి చికిత్స చేయిస్తున్న దశ్యం

క్షణికావేశంతో ఓ తల్లి తన కుమార్తెలకు పురుగుల మందు తాపి..తానూ తాగి ఆత్మహత్యకు యత్నించింది.

 ఆత్మహత్యకు యత్నించిన తల్లి
– అపస్మారక స్థితిలో బాధితురాలు
– చిన్నారుల పరిస్థితి విషయం
– చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలింపు
 
 
ఆదోని టౌన్‌: క్షణికావేశంతో ఓ తల్లి తన కుమార్తెలకు పురుగుల మందు తాపి..తానూ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన బుధవారం ఆదోని పట్టణం శిల్పా సౌభాగ్యనగర్‌లో చోటు చేసుకుంది. టౌ టౌన్‌ సీఐ గంటా సుబ్బారావు, బాధితురాలి తండ్రి ఈరన్న తెలిపిన వివరాలు మేరకు..పట్టణంలోని ఆస్పరి రోడ్డు శిల్పా సౌభాగ్యనగర్‌లో నివాసం ఉంటున్న సంజమ్మ, తిప్పన్నలకు ముగ్గురు కుమారులు. వారి పెద్ద కుమారుడు వీరేష్‌కు ఆదోని మండలం పెసలబండ గ్రామానికి చెందిన గొల్ల సుజాత అలియాస్‌ ఉమాదేవితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెలు ఇంద్రజ (3), వాణి(2)లకు పురుగు మందు తాపి..ఉమాదేవి సైతం తాగింది. ఇరుగు పొరుగు గమనించి కుటుంబ సభ్యలకు తెలియజేయడంతో ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.తల్లితోపాటు ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కర్నూలుకు రెఫర్‌ చేశారు. బాధితురాలి తండ్రి ఈరన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు సీఐ గంటా సుబ్బారావు తెలిపారు. ఉమాదేవి భర్త పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో బేల్దారి పని చేస్తూ వారానికి ఒక సారి ఇంటికి వచ్చి పోయేవాడని సీఐ చెప్పాడు. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోందన్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు తేలుతాయన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement