కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

Pay Bonuses To Contract Workers  - Sakshi

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థకు చెందిన భూగర్భ గనుల్లో టన్నెల్, బెల్ట్‌ క్లీనింగ్, రూఫ్‌ బోల్టింగ్‌ తదితర పనులు చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ 2018 ఏప్రిల్‌ నుంచి 8.33 శాతం బోనస్‌ చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు యర్ర గాని కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే-7షాఫ్ట్, పీవీకే-5బీలో కాంట్రాక్ట్‌ కార్మికుల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రొడక్షన్‌ సైడ్‌ పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు బోనస్‌ చెల్లించాల్సి ఉండగా, కాంట్రాక్టరు చెల్లించటంలేదని ఆరోపించారు. సంబంధిత కాంట్రాక్టర్‌ కార్మికుల శ్రమను దోచుకుంటుంటే గని అధికారులు పట్టించుకోవటం లేదన్నారు.

ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 9న ఏరియా జీఎం కార్యాలయం ఎదుట నిర్వహించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్ట్‌ కార్మి కులు ఆందోళనలో పాల్గొని విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె కిరణ్, బాలకృష్ణ, మోహన్, సురేష్, సత్యనారాయణ, విజయ్, కిరణ్, రాజు, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top