తర్తూరులో పారువేట | paruveta in tartur | Sakshi
Sakshi News home page

తర్తూరులో పారువేట

Apr 14 2017 12:58 AM | Updated on Sep 5 2017 8:41 AM

శ్రీలక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా తర్తూరులో గురువారం పారువేటను వైభవంగా నిర్వహించారు.

జూపాడుబంగ్లా: శ్రీలక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా తర్తూరులో గురువారం పారువేటను వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి పల్లకిలో అధిష్టింపజేశారు. స్వామిని పారువేట గుర్రం వద్దకు తీసుకెళ్లి.. పాత రంగస్వామి దేవాలయం సమీపంలో  గొర్రెను వదిలిపెట్టారు. పాత రంగనాథస్వామివారికి పూజలు నిర్వహించి అక్కడి నుంచి పారువేట గుర్రంతో పాటు స్వామివారిని తీసుకొని పారువేట పద్యాలను పాడుకుంటూ భక్తులు స్వామివారిని తిరిగి దేవాలయానికి చేర్చారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement