ఎందరో కళాకారులకు పుట్టినిల్లయిన పాలకొల్లును సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు కృషి చేయాలని గజల్ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. ఉల్లంపర్రులో ఆయన సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నినాదం ఇచ్చారు.
సాంస్కృతిక రాజధానిగా పాలకొల్లును తీర్చిదిద్దాలి
Aug 23 2016 12:41 AM | Updated on Sep 4 2017 10:24 AM
డాక్టర్ గజల్ శ్రీనివాస్
ఉల్లంపర్రు (పాలకొల్లు అర్బన్) : ఎందరో కళాకారులకు పుట్టినిల్లయిన పాలకొల్లును సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు కృషి చేయాలని గజల్ మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. ఉల్లంపర్రులో ఆయన సోమవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నినాదం ఇచ్చారు. ఎమ్మెల్యే నిమ్మల నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని, తాను ఎమ్మెల్యేకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తానన్నారు. దీపం వెలిగించి ఎలా నమస్కరిస్తామో, మొక్కను కూడా అలాగే నమస్కరించాలన్నారు. మొక్కలు లేనిదే మానవ మనుగడ లేదన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, జెడ్పీటీసీ కోడి విజయలక్ష్మి, ఎంపీపీ పెన్మెత్స శ్రీదేవి, సర్పంచ్ పెదపాటి హవీలా, ఉప సర్పంచ్ పాశర్ల వెంకట రమణ పాల్గొన్నారు
Advertisement
Advertisement