బలవంతపు భూసేకరణ చేస్తే అసెంబ్లీ ముట్టడిస్తాం | p madhu takes on tdp govt | Sakshi
Sakshi News home page

బలవంతపు భూసేకరణ చేస్తే అసెంబ్లీ ముట్టడిస్తాం

Oct 29 2015 11:26 AM | Updated on Aug 13 2018 8:10 PM

బలవంతపు భూసేకరణ చేస్తే అసెంబ్లీ ముట్టడిస్తాం - Sakshi

బలవంతపు భూసేకరణ చేస్తే అసెంబ్లీ ముట్టడిస్తాం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో బలవంతపు భూ సేకరణ చేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు.

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో బలవంతపు భూ సేకరణ చేస్తే అసెంబ్లీని ముట్టడిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు హెచ్చరించారు. గురువారం పి.మధు విజయవాడలో మాట్లాడుతూ... అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎకరానికి 1400 గజాల స్థలాన్ని రైతులకు కేటాయించాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో మరో 300 ఎకరాల భూమి కోసం చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement