ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో గత ఆదివారం నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ఇంకా కొనసాగుతోంది.
ఫిలింనగర్‌లోని ఎఫ్‌ఎన్‌సీసీలో గత ఆదివారం నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ఇంకా పూర్తి కాలేదు. శిథిలాల తొలగింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు జీహెచ్‌ఎంసీ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇనుపచువ్వలు కట్ చేయడం, పిల్లర్లు పగలగొట్టడం చాలా సమస్యాత్మకంగా ఉండటంతో ఆరు రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా కూలిన పోర్టికో శిథిలాలను జేసీబీ సహాయంతో తొలగించే క్రమంలో ఎఫ్‌ఎన్‌సీసీ ప్రధాన భవనానికి ముప్పు ఏర్పడింది. ఇప్పటికే అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన గేటు వద్ద కిటికీలు విరిగిపోయాయి. గోడలు ధ్వంసమయ్యాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుండటంతో ఎఫ్‌ఎన్‌సీసీ యాజమాన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.