breaking news
ghmc engineers
-
రంబుల్స్ట్రిప్స్తో ప్రమాదాలు.. ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు కాంట్రాక్టర్లతో కలిసి రోడ్లు వేయకుండానే బిల్లులు కాజేయడం తెలుసు. ఎక్కడా లేని నిబంధనలతో కావాల్సిన వారికే టెండర్లు కట్టపెట్టడమూ తెలుసు. నాణ్యత లేమితో తూతూమంత్రంగా పనులు చేయడమూ తెలుసు. ఎటొచ్చీ జేబులు నింపుకొనేందుకు చూపిస్తున్న శ్రద్ధ ప్రజలకు ప్రమాదాలు జరగకుండా ఉండటంపై చూపడం లేదు. నాసిరకం రోడ్లే కాదు.. రోడ్డు ప్రయాణాలు చేసేవారికి చూపాల్సిన మార్గదర్శకాలు పట్టించుకుంటే ఒట్టు. చివరకు సైనేజీలపైనా శీతకన్నే. సైనేజీలు, లేన్‌మార్కింగ్‌లు, అడ్డగోలు రంబుల్‌స్ట్రిప్స్ వల్ల ప్రజలకు ఎలా ప్రమాదాలకు ఆస్కారం ఉందో నగరంలో వాహనాల మొబిలిటీ ఎందుకు తగ్గుతుందో జీహెచ్ఎంసీలోని మరో విభాగమే క్షేత్రస్థాయిలో సర్వే చేసి లోపాలు తెలియజేయడం విశేషం. అంతేకాదు, రోడ్‌సేఫ్టీ చర్యల్లో భాగంగా.. రహదారుల ప్రమాణాలకు సంబంధించి దేశంలోనే అత్యున్నత సంస్థలైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ), మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (మోర్త్) ప్రమాణాలకనుగుణంగా ఎలా ఉండాలో సూచిస్తూ జీహెచ్ఎంసీ (GHMC) ట్రాఫిక్ విభాగం రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను జీహెచ్ఎంసీ ఇంజినీర్లు తప్పనిసరిగా పాటించాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. క్షేత్రస్థాయి సర్వే నివేదిక మేరకు.. రోడ్ మార్కింగ్‌లు వేస్తున్నామా అంటే వేస్తున్నాం. స్పష్టంగా కనిపించడం లేదు. చార్మినార్ నుంచి బంజారాహిల్స్, హైటెక్ సిటీ దాకా అదే దుస్థితి. రద్దీప్రాంతాల్లో పాదచారులకుకానీ, పాఠశాలల వద్ద విద్యార్థులకు కానీ సురక్షితంగా రోడ్డు దాటేందుకు జీబ్రా లేన్స్ లేవు. అబిడ్స్ వంటి ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో సైతం పాదచారులు రోడ్డు దాటేందుకు ముప్పుతిప్పలు పడాల్సి వస్తోంది. లేన్ మార్కింగ్లెందుకు? బస్సులు వెళ్లేందుకు, సైకిళ్లు, పాదచారుల కోసం వేర్వేరు విభాగాలుగా ఉండేందుకు లేన్ మార్కింగ్‌లు అవసరం.. కానీ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇవి కనిపించడం లేదు. దీంతో డ్రైవర్లు లేన్లను మారుస్తుండటంతో బాటిల్‌నెక్స్ ఏర్పడుతున్నాయి. అందుకు తాజా ఉదాహరణ చాదర్‌ఘాట్. ఈ గుర్తులేవీ? అవసరమైన ప్రాంతాల్లో ‘స్టాప్’, ‘నో యూ టర్న్’ ‘ముందుకు స్పీడ్‌బ్రేకర్’ ఉంది వంటి హెచ్చరికలు లేవు. ఎన్నో ప్రధాన రహదారులు, జంక్షన్లలోనూ అదే దుస్థితి. జంక్షన్ల వద్ద ఏ దారి ఎటువైపు వెళ్తుందో సూచించే సైనేజీలూ (నేవిగేషన్) లేవు. ఉన్నా ప్రైవేటు ప్రకటనల్లో మూసుకుపోయాయి. దీంతో నగరానికి కొత్తగా వచ్చిన వారికి కానీ, ఇతర ప్రాంతాలకు వెళ్లే నగర ప్రజలకు కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రంబుల్స్ట్రిప్స్తో ప్రమాదాలు అడ్డదిడ్డంగా ఇష్టానుసారంగా వేసిన రంబుల్‌స్ట్రిప్స్ వేగాన్ని తగ్గించేందుకు బదులు ప్రమాద హేతువులవుతున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వాటిని దాటేటప్పుడు అదుపుతప్పి కింద పడిపోతున్నారు. ఓఆర్ఆర్ వంటి ప్రాంతాల్లో పెద్ద వాహనాలు సైతం అదుపు తప్పుతున్నాయి. ఎల్బీనగర్ – ఉప్పల్ మార్గంలో తరచూ ప్రమాదాలకు ఇది కూడా కారణమే. రంబుల్‌స్ట్రిప్స్ ఐఆర్సీ మార్గదర్శకాల మేరకు 10–17 మిమి ఎత్తు, 250–300 వెడల్పుతో ఉండాలి. 600 ఎంఎం గ్యాప్‌తో 6 స్ట్రిప్స్ ఉండాలి కానీ నగరంలో ఎత్తు మాత్రం పెంచారు.అవి సైతం ఎక్కడ పడితే అక్కడ కాకుండా పాదచారులు రోడ్డు దాటే మార్గాలకు ముందు, జంక్షన్ల వద్ద ఏర్పాటు చేయాలి. ‘రంబుల్‌స్ట్రిప్స్ ముందు ఉన్నాయి’ అనే సూచికలు ఉండాలి. సాఫీగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి కానీ లోపభూయిష్ట డిజైన్లతో నడుములు విరుగుతున్నాయి.ఏం చేయాలి ? లోపాలను చక్కదిద్దడంతో పాటు నగరం విశ్వనగరంగా ఉండాలంటే ఆధునిక సాంకేతికతతో కూడిన కొత్త విధానాలు అందుబాటులోకి తేవాలి. సైనేజీలు, సూచికల వంటి వాటి ఏర్పాటుతోపాటు ప్రజలకు వాటి గురించి అవగాహన కలిగేలా నిరంతరం కార్యక్రమాలుండాలి. స్కూల్స్, హాస్పిటల్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక గుర్తులుండాలి. ‘పాదచారి దారిలో ఉన్నారు’, ఓవర్ టేక్ చేయవద్దు, స్పీడ్‌లిమిట్ వంటి సూచనలు రిఫ్లెక్లివ్ బోర్డులతో ఏర్పాటు చేయాలి. జంక్షన్ల వద్ద కౌంట్‌డౌన్ టైమర్లతో కూడిన లైన్లు, పెలికాన్ క్రాసింగ్బటన్లు ఉండాలి. రంబుల్ స్ట్రిప్స్ ఇష్టానుసారం కాకుండా అవసరమైన ప్రాంతాల్లోనే వేయాలి.చదవండి: అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఎకోపార్కుబస్బేస్, ఆన్‌స్ట్రీట్, ఆఫ్‌స్ట్రీట్ పార్కింగ్ ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. ఇరుకు రోడ్లకు, డివైడెడ్ రోడ్లకు వేర్వేకు మార్కింగ్ నిబంధనలుండాలి. ఫ్లై ఓవర్లు, జంక్షన్లు, వలయాకారపు జంక్షన్లు వంటి ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే లేన్లు, మార్గదర్శక సూచనలు ఉండాలి. మలుపులున్న ప్రాంతాల్లో 15 ఎంఎం వెడల్పుతో రోడ్డుకు ఇరువైపులా తెలుపురంగు ఉండాలి. రాత్రిళ్లు కనపడేలా స్టడ్స్ ఉండాలి. సెన్సర్ ఆధారిత రంబుల్ స్ట్రిప్స్ బదులు కాలం చెల్లిన స్టాటిక్ సిస్టమ్‌నే వాడుతున్నారు. వాటిని మార్చడంతోపాటు రంబుల్ స్ట్రిప్స్ (rumble strips) లొకేషన్స్, స్థితిగతులకు సంబంధించి సెంట్రలైజ్డ్ డేటాబేస్ అవసరం. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ఆర్అండ్బీ, హెచ్‌ఎంఆర్‌ల మధ్య సమన్వయ లోపం వల్ల రోడ్డు నిబంధనలు సవ్యంగా అమలు కావడం లేదు. -
13 మంది జీహెచ్ఎంసీ ఇంజనీర్లు సస్పెన్షన్
-
13 మంది జీహెచ్ఎంసీ ఇంజనీర్లు సస్పెన్షన్
► నాలాల పూడికతీత అక్రమాలతో సంబంధం ఉండటమే కారణం ► చర్యలు తీసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీలో నాలాల పూడికతీత అక్రమాలతో సంబంధమున్న 13 మంది సహాయ ఇంజనీర్లను జీహెచ్ఎంసీ కమి షనర్ జనార్దన్‌రెడ్డి శనివారం సస్పెండ్ చేశారు. పూడిక తరలింపు పనుల్లో కాంట్రాక్టర్లు సమ ర్పించిన నకిలీ వే బిల్లుల్ని గుడ్డిగా పాస్ చేయ డంతో అవినీతిలో ప్రమేయం ఉందనే ఆరోప ణలతో వీరిపై ఈ చర్య తీసుకున్నారు. సస్పెం డైన వారిలో ఎంఏ నయీం, కామేశ్వరి, అలీం, శ్రీనివాస్, పాపమ్మ, ప్రేరణ, జమీల్ షేక్, సంతోష్, వశీధర్, లాల్‌సింగ్, మోహన్ రావు, శంకర్, తిరుపతి ఉన్నారు. కాంట్రాక్టర్లకు సహ కరించారనే ఆరోపణలతో శుక్రవారం వీరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్ బెయి ల్‌పై విడుదల చేశారు. ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమ యంలో ఈ అరెస్టులకు నిరసనగా పబ్లిక్‌హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యం లో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇంజనీర్లతో ఆస్తిపన్ను వసూళ్ల నుంచి చెత్త పనుల వరకు ఎన్నో పను లు చేయిస్తుండటంతో తాము అసలు విధుల ను నిర్వర్తించడంలో విఫలమవుతున్నామనే అభిప్రాయా న్ని వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని శిక్షిం చాల్సిందే కానీ..గెజిటెడ్ అధికారు లైన ఇంజ నీర్లను సీసీఏ రూల్స్ ప్రకారం శాఖా పరమైన విచారణ లేకుండానే అరెస్టు చేయ డం భావ్యం కాదన్నారు. కమిషనర్ అందుబా టులో లేకపోవడంతో సోమవారం ఆయనను కలిశాక నిర్ణయం తీసుకోవాలన్నారు. కేసులు ఉపసంహరించకుంటే పెన్‌డౌన్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు ఉపసంహరిం చని పక్షంలో పెన్‌డౌన్ చేయాలని ఇంజనీర్ల సంఘం నిర్ణయించినట్లు తెలిసింది. శనివారం రాత్రి జీహెచ్ఎంసీ కమిషనర్ 13 మంది ఇంజ నీర్లను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. పూడి కతీత పనుల్లో తొలగించిన పూడికను డంపింగ్ యార్డు వరకు తరలించిన వాహనాల నంబర్ల ను బిల్లుల మంజూరు సందర్భంగా ఆడిట్ అధి కారులు పరిశీలించగా అవి స్కూటర్లు, కార్ల నంబర్లని తేలింది. వాటిల్లో పూడిక నెలా తరలిస్తారంటూ రూ. 1.18 కోట్లకు సంబంధిం చిన బిల్లులను అధికారులు నిలిపివే శారు. 18 మంది కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేయడం తో వారిని వారం క్రితం అరెస్టు చేశారు. ఇంజ నీర్ల పాత్ర ఉందని కాంట్రాక్టర్లు ఆరోపించ డంతో వారిపైనా కేసులు నమోదు చేశారు. వారిపై కేసులు ఉపసంహరించుకోని పక్షంలో సోమవారం నుంచి కార్యాచరణకు దిగుతామ ని ఇంజనీర్ల సంఘం నాయకులు తెలిపారు. -
కొనసాగుతున్న శిథిలాల తొలగింపు
ఫిలింనగర్‌లోని ఎఫ్ఎన్సీసీలో గత ఆదివారం నిర్మాణంలో ఉన్న పోర్టికో కుప్పకూలిన ఘటనలో శిథిలాల తొలగింపు ఇంకా పూర్తి కాలేదు. శిథిలాల తొలగింపులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు జీహెచ్ఎంసీ ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఇనుపచువ్వలు కట్ చేయడం, పిల్లర్లు పగలగొట్టడం చాలా సమస్యాత్మకంగా ఉండటంతో ఆరు రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉండగా కూలిన పోర్టికో శిథిలాలను జేసీబీ సహాయంతో తొలగించే క్రమంలో ఎఫ్ఎన్సీసీ ప్రధాన భవనానికి ముప్పు ఏర్పడింది. ఇప్పటికే అద్దాలు ధ్వంసమయ్యాయి. ప్రధాన గేటు వద్ద కిటికీలు విరిగిపోయాయి. గోడలు ధ్వంసమయ్యాయి. కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతుండటంతో ఎఫ్ఎన్సీసీ యాజమాన్యం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.