చోరీ కేసులో నిందితులకు ఏడాది జైలు | one year prison of theft case | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో నిందితులకు ఏడాది జైలు

May 12 2017 10:58 PM | Updated on Aug 11 2018 6:04 PM

మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలుశిక్షతో పాటు, రూ.వంద జరిమానా విధిస్తూ గుంతకల్లు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి వాసుదేవరావ్‌ శుక్రవారం తీర్పును వెలువరించారు.

గుంతకల్లు రూరల్‌ : మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ కేసులో ఇద్దరు నిందితులకు ఏడాది జైలుశిక్షతో పాటు, రూ.వంద  జరిమానా విధిస్తూ గుంతకల్లు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి వాసుదేవరావ్‌ శుక్రవారం తీర్పును వెలువరించారు. ఇందుకు సంబంధించి కసాపురం ఎస్‌ఐ సద్గురుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2015 సెప్టెంబర్‌ 4న గుంతకల్లు పట్టణానికి చెందిన భారతి స్థానిక కసాపురం రోడ్డు సమీపంలోని సిద్ధార్థ నగర్‌ వద్ద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది.

అదే సమయంలో బెలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన ఉప్పర ఎర్రిస్వామి, ఉప్పర. హనుమంతు అనే ఇద్దరు వ్యక్తులు పల్సర్‌ బైకుపై వచ్చి ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కెల్లారు. ఈ ఘటనలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అదే ఏడాది సెప్టెంబర్‌లో పోలీసులు అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. రెండు సంవత్సరాల విచారణ అనంతరం నిందితులకు ఏడాది జైలుశిక్షతోపాటు, వంద రూపాయల జరిమానను విధిస్తూ గుంతకల్లు జేఎఫ్‌సీఎం కోర్టు జడ్జి తీర్పును వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement