ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నిరర్థక ఆస్తులుగా ఉండిపోయిన రుణాలను వసూలు చేసేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్‌ను అమలు చేస్తోందని రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్ తెలిపారు.
31వరకే వన్‌టైమ్ సెటిల్ మెంట్
Mar 22 2017 10:08 PM | Updated on Aug 13 2018 8:03 PM
– ఏపీజీబీ రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు నిరర్థక ఆస్తులుగా ఉండిపోయిన రుణాలను వసూలు చేసేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్‌ను అమలు చేస్తోందని రీజినల్ మేనేజర్ వీసీకే ప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అనారోగ్య కారణాల వల్ల దెబ్బతిన్న వారు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులు తదితరులకు ఉపశమనం కల్పించేందుకు వీలుగా వన్‌టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్‌ను అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ స్కీమ్ ఈ నెల చివరి వరకు ఉంటుందన్నారు. దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి సద్వినియోగం చేసుకునేలా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రీజినల్ పరిధిలోని అన్ని బ్రాంచ్‌లు స్కీమ్‌ను అమలు చేస్తున్నాయన్నారు. మూడేళ్ల క్రితం రుణం తీసుకొని ఇప్పటికీ బకాయిగా ఉండి నిరర్ధక ఆస్తులుగా ఉన్న వాటికి ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌ను వినియోగించుకొని రుణ విముక్తులు కావాలని కోరారు.
Advertisement
Advertisement