రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కాజీపేట సబ్‌డివిజన్ పరిధిలోని హసన్‌పర్తి- ఉప్పల్ రైల్వే స్టేషన్ల మధ్యగల బావుపేట రైల్వే బ్రిడ్జిపై మంగళవారం జరిగింది.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
Sep 28 2016 12:19 AM | Updated on Sep 28 2018 3:41 PM
కాజీపేట రూరల్ : రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన కాజీపేట సబ్‌డివిజన్ పరిధిలోని హసన్‌పర్తి- ఉప్పల్ రైల్వే స్టేషన్ల మధ్యగల బావుపేట రైల్వే బ్రిడ్జిపై మంగళవారం జరిగింది. కాజీపేట జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం కానిపర్తి గ్రామానికి చెందిన పశువుల కాపరి గొర్రె ఏలియా(62) పశువులను తోలుకొని ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో పశువులను సమీపంలోని వాగులోకి పంపి అతడు బావుపేట రైల్వే బ్రిడ్జిపైకి వస్తుండగా రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీఽకొట్టడడంతో అక్కడికక్కడే మృతిచెందగా మృతదేహం ఎగిరి వాగులో పడిపోయింది. ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారని ఆయన తెలిపారు.
Advertisement
Advertisement