వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

వ్యక్తి మృతి

Published Sat, Nov 12 2016 2:09 AM

వ్యక్తి మృతి

బుచ్చిరెడ్డిపాళెం : టిప్పర్‌ టైర్లు వ్యక్తి తలపైకి ఎక్కడంతో అతను మృతిచెందిన సంఘటన మండలంలోని రేబాల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. రేబాల వద్ద బొల్లినేని కన్‌స్ట్రక్షన్స్‌ ఆధ్వర్యంలో ముంబయి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం సికరా ప్రాంతానికి చెందిన గంగాప్రసాద్‌యాదవ్‌ ( 60) తన కుమారుడితో కలిసి కొంతకాలంగా రహదారి పనులు చేస్తున్నాడు. రేబాల వద్ద శుక్రవారం మట్టిని అన్‌లోడ్‌ చేసే క్రమంలో టిప్పర్‌ టైర్లు గంగా ప్రసాద్‌ తలపైకి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement