తాగిన మైకంలో ఒకరి ఆత్మహత్య | One drunken suicide | Sakshi
Sakshi News home page

తాగిన మైకంలో ఒకరి ఆత్మహత్య

Sep 18 2016 12:48 AM | Updated on May 25 2018 2:06 PM

గుడంబాకు బానిసైన ఓ గిరిజనుడు తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని జామతండ శివారు తారాసింగ్‌ బావితండాలో శుక్రవారం రాత్రి జరిగింది.

జామాతండ (నెల్లికుదురు) : గుడంబాకు బానిసైన ఓ గిరిజనుడు తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని జామతండ శివారు తారాసింగ్‌ బావితండాలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై గోదారి రాజ్‌కుమార్‌ కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు వీరు నాయక్‌(35) తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
 
ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందుల తో గుడుంబాకు బానిసై ఇంట్లోఎవరూ లేని సమయంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారంఅతడి భార్యపద్మఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.మృతుడికిఇద్దరు కుమారులు ఉన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement