ఒలింపిక్‌ క్రీడల్లో క్యారమ్స్‌ను చేర్చాలి | olympics sports in carroms | Sakshi
Sakshi News home page

ఒలింపిక్‌ క్రీడల్లో క్యారమ్స్‌ను చేర్చాలి

Aug 29 2016 8:33 PM | Updated on Sep 4 2017 11:26 AM

‘ఎనిమిదేళ్ల వయస్సు నుంచి హైదరాబాద్‌ క్యారమ్స్‌ అసోసియేషన్‌ నేతృత్వంతో నా తండ్రి సాయికుమార్‌ కోచ్‌గా శిక్షణ పొందాను. 2004లో శ్రీలంకలో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో, ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ కప్‌ పోటీల్లో విజేతగా నిలిచాను. సార్క్‌ పోటీల్లో సిల్వర్‌మెడల్‌తో పాటు ఇటీవల మాల్దీవులలో జరిగిన టోర్నమెంట్‌లో ఇండియా గెలవగా, ఇండియన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచా. దేశంలో జరిగిన అనేక టోర్నమెంట్ల

  • వరల్డ్‌ చాంపియన్‌ అపూర్వ
  •  
    ఒలింపిక్స్‌ లాంటి అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీలలో క్యారమ్స్‌ను చేరిస్తే బాగుంటుందని వరల్డ్‌ చాంపియన్‌ అపూర్వ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయస్థాయిలో రాణిస్తే క్యారమ్స్‌ క్రీడాకారులకు దేశంలో మరింత గుర్తింపు వస్తుందన్నారు. సోమవారం స్థానిక సూర్యగార్డెన్స్‌లో జరుగుతున్న ఎల్‌ఐసీ సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కారమ్స్, చెస్‌ టోర్నమెంట్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ముచ్చటించిన విషయాలు ఆమె మాటల్లోనే.. 
    – ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం)
    ‘ఎనిమిదేళ్ల వయస్సు నుంచి హైదరాబాద్‌ క్యారమ్స్‌ అసోసియేషన్‌ నేతృత్వంతో నా తండ్రి సాయికుమార్‌ కోచ్‌గా శిక్షణ పొందాను. 2004లో శ్రీలంకలో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీల్లో, ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ కప్‌ పోటీల్లో విజేతగా నిలిచాను. సార్క్‌ పోటీల్లో సిల్వర్‌మెడల్‌తో పాటు ఇటీవల మాల్దీవులలో జరిగిన టోర్నమెంట్‌లో ఇండియా గెలవగా, ఇండియన్‌  ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచా. దేశంలో జరిగిన అనేక టోర్నమెంట్లలో విజ యం సాధించాను. బర్మింగ్‌హామ్‌లో నవంబరులో జరిగే వరల్డ్‌æచాంపియన్‌షిప్‌ పోటీలకు దేశం తరఫున ఎంపికైన నలుగురిలో ఉన్నాను. స్పోర్ట్స్‌కోటాలో ఎల్‌ఐసీలో ఉద్యోగం లభించింది. ఇప్పుడు  ఏవోగా పదోన్నతి వచ్చింది. ఇంకా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. క్యారమ్స్‌లో రాణించడానికి ఎల్‌ఐసీ యాజమాన్యం అన్ని విధాలా సహకరిస్తోంది. సాధన చేసేందుకు ఒక పూట మాత్రమే కార్యాలయానికి వెళ్లేలా వెసులుబాటు లభించింది. ఎల్‌ఐసీలో ఉద్యోగంలో చేరాకే వరల్డ్‌ చాంపియన్‌నయ్యాను. నిరంతర కఠోరసాధన, ఏకాగ్రతతో ఆడటం ద్వారా విజయం సాధించవచ్చు. ఆటగాళ్లకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement