ఇంటి రేకులపై సిమ్మెంటు వేసుకుంటున్న వృద్దురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న ఎమ్మెల్యే కళావతి
ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు సవర బూదమ్మ.
శ్రీకాకుళం: ఈ చిత్రంలో కనిపిస్తున్న అవ్వ పేరు సవర బూదమ్మ. ఈమె వయస్సు 75 సంవత్సరాలు. ఈమెకు నా అంటూ ఎవరూ లేరు. భర్త ఎప్పుడో మృతి చెందాడు. సంతానం లేదు. దీంతో ఒంటిరిగా ఈ వయస్సులో అష్టకష్టాలు పడుతూ జీవనాన్ని నెట్టుకొస్తుంది. ఈమెకు నిబంధనల మేరకు పీటీజీ కావడంతో అంత్యోదయ కార్డు ఉండాల్సి ఉంది. కానీ అందరిలాంటి రేషన్‌కార్డు ఉండడంతో నెలకు కేవలం ఐదు కిలోల బియ్యం మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తుంది. దీంతో నెలంతా సాగలేక అష్టకష్టాలు పడుతూ ఇబ్బందుల పాలవుతుంది. తాను నివసిస్తున్న ఓ రేకుల షెడ్డుకు మరమ్మతులై వర్షానికి కారుతుండడంతో ఇలా సిమెంటు రాసేందుకు ఇంటి పైకప్పు మీదకు ఎక్కి తన పని తాను చేసుకుంటూ శుక్రవారం సాక్షి కెమెరాకు చిక్కింది. దీన్ని గుర్తించిన ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అవ్వకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
–సీతంపేట