వృద్ధురాలి దారుణ హత్య | old woman murder in kummaravandlapalli | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి దారుణ హత్య

Jul 13 2017 11:13 PM | Updated on Sep 5 2017 3:57 PM

వృద్ధురాలి దారుణ హత్య

వృద్ధురాలి దారుణ హత్య

మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో గురువారం తెల్లవారుజామున లక్ష్మమ్మ (65) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాతిని తలపై మోది దారుణంగా హత్య చేశారు.

కదిరి అర్బన్‌ : మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో గురువారం తెల్లవారుజామున  లక్ష్మమ్మ (65) అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు బండరాతిని తలపై మోది దారుణంగా హత్య చేశారు. మృతురాలు యాచకవృత్తి చేసుకుని జీవించేంది. రాత్రి పూట రోడ్డుపక్కనున్న షాపుల వద్ద వరండాలో నిద్రిస్తుండేది. ఇంత దారుణంగా వృధ్దురాలిని హత్య చేశారంటే అది ఆమె దగ్గర ఉన్న డబ్బును లాక్కునేందుకా..లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయం పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

దుండగుల ఆచూకీ తెలుసుకునేందుకు పట్టణ సీఐ శ్రీనివాసులు డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీంలను రంగంలో దించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తన తల్లి మృతి చెందడంతో కుమార్తె  రమణమ్మ కన్నీరు మున్నీరైంది. రూరల్‌ మండల ఎస్సై వెంకటప్రసాద్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement