బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన | old man's indecent behaviour | Sakshi
Sakshi News home page

బాలికతో వృద్ధుడి అసభ్య ప్రవర్తన

Aug 15 2016 9:51 PM | Updated on Sep 4 2017 9:24 AM

గురుజువాడకు చెందిన శివకుమార్‌ (56).. గ్రామంలో ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి గ్రామ శివారులో ఉన్న పొలానికి తీసుకెళ్లాడు.

కోహీర్‌: విచక్షణ లేని ఓ వృద్ధుడు ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఎస్‌ఐ ప్రవీన్‌కుమార్‌రెడ్డి అందించిన సమాచారం ప్రకారం.. గురుజువాడకు చెందిన శివకుమార్‌ (56).. గ్రామంలో ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి గ్రామ శివారులో ఉన్న పొలానికి తీసుకెళ్లాడు. అక్కడ అసభ్యంగా ప్రవర్తించాడు. శివకుమార్‌ తీరును గమనించిన సమీపంలోని రైతు ఒకరు సెల్‌ఫోన్‌ ద్వారా బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పొలానికి చేరుకొని తన కుతూరును చేరదీసి శివకుమార్‌ను చితకబాదారు. గ్రామానికి తీసుకువచ్చి పంచాయతీ కార్యాలయం వద్ద నిర్బంధించారు. కోహీర్‌ ఎస్‌ఐ ప్రవీన్‌కుమార్‌రెడ్డి సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో తన సిబ్బందితో గురుజువాడకు వెళ్లారు. బాలిక కుటుంబసభ్యులకు నచ్చచెప్పి వారి అదుపు నుంచి నిందితుడు శివకుమార్‌ను విడిపించి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement