గుండె జబ్బు భరించలేక.. | old lady suicide with heart problems | Sakshi
Sakshi News home page

గుండె జబ్బు భరించలేక..

Oct 8 2016 9:22 PM | Updated on Sep 4 2017 4:40 PM

రుక్కమ్మ మృతదేహం

రుక్కమ్మ మృతదేహం

స్థానిక తిరుమలాపూర్‌ చెరువులో శనివారం అల్లాదుర్గం మండలం ఘట్‌పల్లికి చెందిన తెనుగు రుక్కమ్మ (65) మృతదేహం లభ్యమైంది.

తిరుమలాపూర్‌ చెరువులో ఘటన
అల్లాదుర్గం మండలం ఘట్‌పల్లికి చెందిన మహిళగా గుర్తింపు

పెద్దశంకరంపేట: స్థానిక తిరుమలాపూర్‌ చెరువులో శనివారం అల్లాదుర్గం మండలం ఘట్‌పల్లికి చెందిన తెనుగు రుక్కమ్మ (65) మృతదేహం లభ్యమైంది. పెద్దశంకరంపేట ఎస్‌ఐ విజయరావ్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  శనివారం తెల్లవారు జామున మహిళ శవం ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు మహిళ మృతదేహాన్ని చెరువులో నుండి వెలికితీయించారు. మృతురాలికి సంబంధించిన వివరాలు సేకరించగా అల్లాదుర్గం మండలం ఘట్‌పల్లికి చెందిన రుక్కమ్మగా గుర్తించామన్నారు.

రుక్కమ్మ కొంత కాలంగా హైదరాబాద్‌లోని ఉషాముళ్లపూడిలో గుండెకు సంబంధించిన ట్రీట్‌మెంట్‌ తీసుకుంటోందన్నారు. గుండెకు సంబంధించిన బాధ ఎక్కువ కావడంతో ఆమె పేటలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటానని ఇంట్లో చెప్పి బయలుదేరిందని ఆయన తెలిపారు. బాధ ఎక్కువై తిరుమలాపూర్‌ చెరువులో పడి ఆత్మహత్య  చేసుకుందని ఆయన తెలిపారు. కాగా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి, భర్త నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement