ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటా? | NTR statue issue | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటా?

Jul 31 2016 9:47 PM | Updated on Sep 4 2017 7:13 AM

ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటా?

ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటా?

మండల కేంద్రమైన అమరావతి మద్దూరుడౌన్‌ సెంటర్‌లో ఎటువంటి అనుమతులు లేకుడా ఎన్టీఅర్‌ విగ్రహం ఏర్పాటు చేయడంపై పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త కావటి శివనాగమనోహరనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనుమతుల్లేకుండా సన్నద్ధం
న్యాయ పోరాటం చేస్తాం..
వైఎస్సార్‌ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి
కావటి మనోహర్‌నాయుడు
 
అమరావతి:  మండల కేంద్రమైన అమరావతి మద్దూరుడౌన్‌ సెంటర్‌లో ఎటువంటి అనుమతులు లేకుడా ఎన్టీఅర్‌ విగ్రహం ఏర్పాటు చేయడంపై పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమన్వయకర్త కావటి శివనాగమనోహరనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎస్‌.ఐ వెంకటప్రసాద్‌కు ఫిర్యాదు అందించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నగరాల అభివృద్ది పేరుతో ఆలయాలను నేలమట్టం చేసిన ప్రభుత్వం విజయవాడలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వైఎస్సార్‌ విగ్రహన్ని తొలగించటం దారుణమన్నారు. ఇటీవల అమరావతిలో రోడ్డు విస్తరణ అడ్డుగా ఉన్నాయనే సాకుతో జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను తొలగించి, పక్కనే మూడు రోడ్ల కూడలిలో ఎన్టీఅర్‌ విగ్రహం ఏర్పాటు చేయడం టీడీపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement