రాజమహేంద్రవరం తరలిన ఎన్టీఆర్‌ కృష్ణ విగ్రహం | NTR STATUE | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరం తరలిన ఎన్టీఆర్‌ కృష్ణ విగ్రహం

Jul 30 2016 10:31 PM | Updated on Sep 4 2017 7:04 AM

రాజమహేంద్రవరం తరలిన ఎన్టీఆర్‌ కృష్ణ విగ్రహం

రాజమహేంద్రవరం తరలిన ఎన్టీఆర్‌ కృష్ణ విగ్రహం

రాజమహేంద్రవరం నగరంలోని పుష్కరాల రేవులో నెలకొల్పేందుకు శ్రీకృష్ణుని రూపంలో తీర్చిదిద్దిన ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని శనివారం రాత్రి కొత్తపేట నుంచి తరలించారు. స్థానిక శిల్పి డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌ ఐదు టన్నుల కాంస్యంతో 15 అడుగుల ఎత్తు గల ఎన్టీఆర్‌ కృష్ణుని విగ్రహాన్ని తయారు చేశారు.

కొత్తపేట:
రాజమహేంద్రవరం నగరంలోని పుష్కరాల రేవులో నెలకొల్పేందుకు శ్రీకృష్ణుని రూపంలో తీర్చిదిద్దిన ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని శనివారం రాత్రి కొత్తపేట నుంచి తరలించారు. స్థానిక శిల్పి డి.రాజ్‌కుమార్‌ వుడయార్‌ ఐదు టన్నుల కాంస్యంతో 15 అడుగుల ఎత్తు గల ఎన్టీఆర్‌ కృష్ణుని విగ్రహాన్ని తయారు చేశారు. కొత్తపేటలోని రాజకుమార్‌ శిల్పశాలకు శనివారం సాయంత్రం వచ్చిన రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని ప్యాకింగ్‌ చేసి క్రేన్‌ ద్వారా ప్రత్యేక వాహనంపై ఎక్కించి తరలించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement