వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి | nregs labour dies of sun stroke | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి

Jun 1 2017 11:04 PM | Updated on Sep 5 2017 12:34 PM

లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన ఆదినారాయణ(45) అనే ఉపాధి కూలీ వడదెబ్బతో గురువారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

లేపాక్షి (హిందూపురం) : లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన ఆదినారాయణ(45) అనే ఉపాధి కూలీ వడదెబ్బతో గురువారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయమే ఉపాధి పనికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాక, కాసేపు విశ్రాంతి తీసుకున్నాడని వివరించారు. అంతలోనే అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ  మృతి చెందాడన్నారు. మృతునికి భార్య లక్ష్మమ్మ, ఒక కుమారుడు ఉన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement