పుష్కరాల విధుల్లో భాగంగా ఎస్పీ ఆకే రవికష్ణ శ్రీశైలంలో ఉండటంతో సోమవారం పోలీసు ప్రజాదర్బార్ తూతూమంత్రంగా సాగింది.
తూతూమంత్రంగా పోలీస్ ప్రజాదర్బార్
Aug 9 2016 12:24 AM | Updated on Aug 21 2018 5:54 PM
కర్నూలు: పుష్కరాల విధుల్లో భాగంగా ఎస్పీ ఆకే రవికష్ణ శ్రీశైలంలో ఉండటంతో సోమవారం పోలీసు ప్రజాదర్బార్ తూతూమంత్రంగా సాగింది. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాసులు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎస్పీకి చెప్పుకుందామని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు జిల్లా కేంద్రానికి తరలివచ్చి పోలీసు ప్రజాదర్బార్‌లో వినతిపత్రాలు సమర్పించారు. సమస్యలపై ఆరా తీసి స్థానిక పోలీసు అధికారులను కలవాల్సిందిగా సిఫారసు చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. నంద్యాల, ఎర్రకోట, గోవిందపల్లె, నందికొట్కూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకున్నారు. కుటుంబ కలహాలు, భూతగాదాలు, స్థలాల ఆక్రమణ వంటి సమస్యలపై బాధితులు పోలీసు ప్రజాదర్బార్‌ను ఆశ్రయించారు.
Advertisement
Advertisement